తుది మలుపు | Thudi Malupu by- Jammers
దారె చేరే తడబాటుల్లో వేగం అంతా పోయిందా
పేరే లేని దిగులే ముల్లై గాయాలెవో చేసిందా
స్నేహం కూడా రూపం మారి మోసం అయిందా
లోకం చూసే చూపుల్లోనే చూపే ఆగిందా
ప్రాణం పోసే ప్రేమల్లె ఓ ప్రేమే చేరిందా
ఏంతో దూరం రాకుండానే వేరైపోయిందా
కళ్లె తడిపిన ఊసె ఇల్లే విడిచిన రోజే
కళ్లె కలలను వీడే ఇల్లే నడిపిన నాడె
లోలోతుల్లో పిల్లాడల్లే ఉన్నా
ఓ.. ఓ... ఓ ....
ఓ.. ఓ...ఓ....
ఓ.. ఓ...ఓ...
ఓ.ఓ. ఓ..ఓ..ఓ..ఓ..ఓ.
ఓ.. ఓ... ఓ ....
ఓ.. ఓ...ఓ....
ఓ.. ఓ...ఓ...
ఓ.ఓ. ఓ..ఓ..ఓ..ఓ..ఓ.
దాటే మలుపుల్లో
మళ్ళీ పడిలేచే
ఆటే కటినంగా
మలిచిందా యదనంతా....
మారే కలలన్నీ
ఈనాటి వెలుగుల్నే
చేరే కథలైయి
గురుతుల్లా నిలిచాయి.
.
.
ప్రాణం పోయే రోజే ఏదో చూసే వీలుందా
కథ అంతం అయ్యేలోగా పూర్తయ్యా......! ❤️🩹
Credits:
రచన : శ్రీరాగ్ వడ్లకొండ
గానం, గాత్రం,భావం : కృష్ణ తేజస్వి
Guitar : చిన్న స్వామి
Bass : జగదీష్
Piano : నరేన్ సిద్ధార్థ్
Drums : షషాన్క్ భాస్కరుని
Digital Art by - రాశి
Album: Dairy
Song Name : తుది మలుపు / Thudi Malupu
song number: 5
Comments