మళ్ళీ - Malli By Krishna tejasvi

గానం ,గాత్రం – కృష్ణ తేజస్వి 
సాహిత్యం – అమ్మ( పెళ్ళూరి.ఉష ప్రసన్న గారు )
Guitar – కార్తిక్ సి హెచ్. ఎ 
Mix & Master – రోషన్ సెబాస్టియన్

ఏదేమైనా తన దారే అది మార్చుకుందా
భూమేమైనా తను తిరిగే వేళా
తానేమైనా ఒకసారే నిను తాకుతుందా
ప్రేమేమైనా జీవిత కాలాన

ఈ... మనసు విరిగిపోయేలా
కలలు కరిగిపోయేలా గుండె చెదిరినా
ఆ .... కలతలు కరిగించేలా
కలలును కనిపించేలా ఎదురవదా
కాలం చేసిన గాయం మరుగవదా మరి
మారం చేసే మనసే సుఖపడదా
దారే మారే తీరే కనపడగా సరాసరి
ప్రేమై తానే మళ్ళీ జతఅవగా.


మదిలో ఆశై తను నిండిన ఈ ప్రేమ
మనిషల్లే తానే తోడు చేరి దారి చూపదా
ఎవరో నీకై నిను చేరుకోకున్నా
నీడల్లే నిన్ను వీడిపోక సాగు నీజతగా 

_ఏపుడో ఏదో ఒకలాగా జరిగిందనీ
ఇక ప్రేమే లేదంటే ఎలా!!

కాలం చేసిన గాయం మరుగవదా మరి
మారం చేసే మనసే సుఖపడదా

దారే మారే తీరే కనపడగా సరాసరి
ప్రేమై తానే మళ్ళీ జతఅవగా!!






Comments